మూడు సంవత్సరాలు ప్రేమించుకుని.. | Wife Protest In Front of Husband House in Warangal | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుని ముఖం చాటేశాడు..

Jun 6 2020 1:29 PM | Updated on Jun 6 2020 1:29 PM

Wife Protest In Front of Husband House in Warangal - Sakshi

వరంగల్‌ రూరల్‌, కురవి: మూడు సంవత్సరాలు ప్రేమించుకుని.. మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అవసరం తీరాక భర్త ముఖం చాటేయడంతో భార్య అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల నేరడ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు ఎల్లయ్య, అనసూర్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరడకు చెందిన మునీశ్వరి, అదే గ్రామానికి చెందిన ఇరుగు నాగరాజు ప్రేమించుకుని మూడు నెలల క్రితం బయ్యారం పెద్ద చెరువు వద్ద పెళ్లి చేసుకున్నారు. తన తల్లిదండ్రులను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తానని, అప్పటి వరకూ మీ ఇంట్లోనే ఉండాలని నాగరాజు మునీశ్వరికి చెప్పినట్లు వారు తెలిపారు. అవసరం తీరాక వద్దు పొమ్మంటున్నాడని, ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని, తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై ఎస్సై శంకర్‌రావును వివరణ కోరగా అతడితో పెళ్లి చేయాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.(ప్రేమ పెళ్లి.. అమ్మను కొట్టొద్దు నాన్నా..)

ఆందోళన చేస్తున్న బాధితురాలు తదితరులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement