ఖైదీ భర్తకు సెల్‌ఫోన్ ఇవ్వబోయి పట్టుబడ్డ భార్య | wife captured by with mobile in prison | Sakshi
Sakshi News home page

ఖైదీ భర్తకు సెల్‌ఫోన్ ఇవ్వబోయి పట్టుబడ్డ భార్య

May 19 2015 2:36 AM | Updated on Mar 28 2018 11:08 AM

జైలుశిక్ష అనుభవిస్తున్న భర్తకు సెల్‌ఫోన్‌తోపాటుగా మద్యం సీసాను ఇచ్చేందుకు యత్నించిన భార్యను జైలు భద్రతా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్: జైలుశిక్ష అనుభవిస్తున్న భర్తకు సెల్‌ఫోన్‌తోపాటుగా మద్యం సీసాను ఇచ్చేందుకు యత్నించిన భార్యను జైలు భద్రతా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన ఎం. మహేశ్(33)కు ఓ హత్య కేసులో శిక్ష పడింది.  2012 జూన్ 8వ తేదీ నుంచి చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు.

అయితే సోమవారం అతని భార్య లక్ష్మీ ములాఖత్ కోసం జైలుకు వచ్చింది. భద్రతాసిబ్బంది అనుమానంతో ఆమెను తనిఖీ చేయగా ఒక సెల్‌ఫోన్‌తోపాటు మద్యం సీసా లభించినట్లు జైలు అధికారులు తెలిపారు.ఆమెను కుషాయిగూడ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేసినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement