కొబ్బరికాయ ఒకటే... కానీ లోపల చూస్తే...! | When Coconet made of two parts as inside of one more coconet | Sakshi
Sakshi News home page

కొబ్బరికాయ ఒకటే... కానీ లోపల చూస్తే...!

Mar 29 2015 3:07 PM | Updated on Sep 2 2017 11:33 PM

కొబ్బరికాయ ఒక్కటే... దాన్ని కొట్టి చూస్తే లోపల రెండు భాగాలు కనిపించాయి.

మిర్యాలగూడ టౌన్: కొబ్బరికాయ ఒక్కటే... దాన్ని కొట్టి చూస్తే లోపల రెండు భాగాలు కనిపించాయి. ఈ విశేషం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీనగర్‌లో చోటు చేసుకుంది. శ్రీరామనవమి పూజలో భాగంగా శనివారం కొండవీటి శేఖర్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టగా అందులో రెండు కాయలుగా ఉండడాన్ని చూసి అక్కడున్న వారు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇదేదో మంచి పరిణామంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు కూడా చూసేందుకు వారింటికి క్యూకట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement