'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి' | we will take action against VNR Vignana Jyothi Institute, says Nayani Narasimha Reddy | Sakshi
Sakshi News home page

'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి'

Jun 15 2014 9:04 PM | Updated on Oct 20 2018 5:03 PM

'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి' - Sakshi

'వాటంతటవే పైకి తేలితేనే దొరుకుతాయి'

హిమాచల్‌ ప్రదేశ్ ఘటనకు బాధ్యులైన వారిని వదలబోమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు.

మండి: హిమాచల్‌ ప్రదేశ్ ఘటనకు బాధ్యులైన వారిని వదలబోమని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. మండి కలెక్టర్ నివేదిక అందిన వెంటనే కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థుల ఫీజును రీయింబర్స్‌మెంట్ చేసేందుకు కాలేజ్ మేనేజ్ మెంట్ ఒప్పుకుందని తెలిపారు.

విద్యార్థుల కుటుంబానికి కాలేజీలో సీటు లేదా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. గల్లంతైన విద్యార్థుల మృతదేహాల గాలింపుకు సంబంధించి అన్ని మార్గాలు ఉపయోగించామని చెప్పారు. వాటంతటవే పైకి తేలితేనే మృతదేహాలు దొరుకుతాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement