నాయిని అంత్యక్రియల్లో దొంగల చేతివాటం

Thefting In Nayani Narsimha Reddy Funerals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం చూపారు. అంతక్రియలకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకుల పర్సులను ఓ దొంగల ముఠా కొట్టివేసింది. బాధితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఫిర్యాదుతో వెంటనే తేరుకున్న పోలీసులు గ్యాంగ్‌లో ఒక సభ్యున్ని గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి మూడువేలకు పైగా సొమ్మును రికవరీ చేశారు. ఈ ముఠాలోని ఇతరుల కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. కాగా కార్మిక, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు నగరంలోని మహా ప్రస్థానం స్మశానవాటికలో ముగిశాయి. అంత్యక్రియల్లో మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్ని కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. (పాడె మోసిన కేటీఆర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top