26, 27న నీళ్లు బంద్‌ | Water Supply Bandh on 26 And 27th August | Sakshi
Sakshi News home page

26, 27న గండిపేట్‌ నీళ్లు బంద్‌

Aug 24 2019 10:37 AM | Updated on Aug 31 2019 12:16 PM

Water Supply Bandh on 26 And 27th August - Sakshi

గ్రేటర్‌ పరిధిలోని పలు ప్రాంతాలకు ఈ నెల 26, 27 తేదీల్లో గండిపేట నీటి సరఫరాను నిలిపివేస్తున్నారు. మరమ్మతు పనుల కారణంగాఈ చర్య చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. తిరిగి 28న నీటిసరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.  

సాక్షి ,సిటీబ్యూరో: ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట్‌)కాల్వ, ఆసిఫ్‌నగర్‌ నీటిశుద్ధికేంద్రం వద్ద ఫిల్టర్‌బెడ్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు ప్రాంతాలకు నీటిసరఫరా నిలిపివేయనున్నట్లు జలమండలి ప్రకటించింది. దీంతో కాకతీయనగర్, సాలార్జంగ్‌కాలనీ, పద్మనాభనగర్, ఖాదర్‌బాగ్, విజయనగర్‌కాలనీ, చింతల్‌బస్తీ, హుమయూన్‌నగర్, సయ్యద్‌నగర్, ఏసీగార్డ్స్, ఖైరతాబాద్, మల్లేపల్లి, బోయిగూడా కమాన్, ఆగాపురా, నాంపల్లి, దేవీబాగ్, అఫ్జల్‌సాగర్, సీతారాంబాగ్, హబీబ్‌నగర్, ఎస్‌ఆర్‌టీ, జవహర్‌నగర్, పీఎన్‌టీ కాలనీ, సాయన్న గల్లీ, అశోక్‌నగర్, ఇలాచిగూడా, జ్యోతినగర్, వినాయక్‌నగర్, మైసమ్మబండ, ఎంసీహెచ్‌ క్వార్టర్స్,సెక్రటేరియట్, రెడ్‌హిల్స్, హిందీనగర్, గోడేఖీ కబర్, గన్‌ఫౌండ్రి, దోమల్‌గూడా, లక్డికాపూల్, మణికొండ, పుప్పాల్‌గూడా, నార్సింగి ప్రాంతాలకు నీటిసరఫరా నిలిచిపోనుంది. ఈ నెల 28 తిరిగి నీటిసరఫరా పునరుద్ధరిస్తామని జలమండలి అధికారులు ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement