తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి మంచి నీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నల్గొండ: తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి మంచి నీటి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ... థర్మల్ పవర్ప్లాంట్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్యుత్ సమస్యలేకండా చేస్తామన్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీలు మేరకు త్వరలో పునర్విభజనలో భాగంగా సూర్యాపేటను జిల్లాగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు.