వాచ్‌మన్ అనుమానాస్పద మృతి | watchman suspicious death in ghatkesar | Sakshi
Sakshi News home page

వాచ్‌మన్ అనుమానాస్పద మృతి

Sep 1 2015 4:40 PM | Updated on Mar 28 2018 11:11 AM

వాచ్‌మన్గా పనిచేస్తున్న ఓ నేపాలీ వాసీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఘట్‌కేసర్ (రంగారెడ్డి): వాచ్‌మన్గా పనిచేస్తున్న ఓ నేపాలీ వాసీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని చౌదరి గూడలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతుస్తుల భవనం నుంచి వాచ్మన్ జైరాం బహుదూర్ పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వాచ్ మన్ ది.. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలోపోలీసులు విచారణ ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement