వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు | Waqf Board to the activities of the division | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు

Feb 11 2015 2:22 AM | Updated on Sep 2 2017 9:06 PM

వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు

వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు

తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మైనారిటీ

కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా వెల్లడి
ఎంఎస్‌డీపీ కింద రూ. 38 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం
కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ భేటీ
పడో పర్దేశ్, ఉడాన్ పథకాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి
 

హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తు ల్లా హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం ఢిల్లీలో ఆమెను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్రమంత్రికి వివరించారు. ఎంఎస్‌డీపీ కింద రాష్ట్రానికి రూ. 38 కోట్లు మంజూరు చేసేందుకు ఈ సందర్భంగా హెప్తుల్లా అంగీకరించారు. ఏపీ వక్ఫ్‌బోర్డును తక్షణమే రెండుగా విభజించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చా రు. దీనిపై 18వ తేదీన హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి సూచిస్తానన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) పథకం కింద శిక్షణ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు.

కేంద్రం నుంచి అందుతున్న ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను యథావిధిగా కొనసాగించాలని నజ్మాను మహమూద్ అలీ కోరారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ర్టంలో స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పడో పర్దేశ్’, ‘ఉడాన్’, ‘ఉస్తాద్ హమారీ దారోహర్’ పథకాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాం నాయక్, బాల్కసుమన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షుకూర్ తదితరులు డిప్యూ టీ సీఎంతో పాటు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement