ఇరాన్‌కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్‌ ఆగ్రహం | Why Russia is not Helping Iran Putin Reply | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్‌ ఆగ్రహం

Jun 23 2025 11:46 AM | Updated on Jun 23 2025 12:42 PM

Why Russia is not Helping Iran Putin Reply

మాస్కో: ఇరాన్‌- రష్యాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌- ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యంతో ఇరాన్‌ మరిన్ని చిక్కుల్లో పడింది. ఇదే సమయంలో ఇరాన్‌కు ఎందుకు సహాయం అందించడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విలేకరులు అడిగినప్పుడు ఆయన ఘాటైన సమాధానం ఇచ్చారు.

ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్న తర్వాత కూడా, టెహ్రాన్‌ను రక్షించేందుకు మాస్కో(రష్యా) ఎందుకు ముందుకు రాలేదో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాకు వివరించారు. రష్యా- ఇరాన్‌ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. ఇజ్రాయెల్‌లో రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ.. పూర్వ సోవియట్ యూనియన్,  రష్యన్ ఫెడరేషన్‌లకు చెందిన దాదాపు  20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. ఇది నేడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగా ఉంది. రష్యా సమకాలీన చరిత్రలో  భాగంగా ఆ దేశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రష్యా తన మిత్రదేశాల విషయంలో ప్రదర్శిస్తున్న విధేయతను ప్రశ్నించేవారి విమర్శకులను కూడా పుతిన్ తిప్పికొట్టారు.  అటువంటి వారిని రెచ్చగొట్టేవారుగా పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలతో రష్యా సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని, రష్యా జనాభాలో 15 శాతం మంది ముస్లింలున్నారని పుతిన్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: నిపుణులకు షాకిచ్చిన అమెరికా దాడుల వ్యూహం

Advertisement
 
Advertisement
Advertisement