breaking news
Union Minister Najma Heptullah
-
కేంద్ర మంత్రులు నజ్మా, సిద్దేశ్వర రాజీనామా
- నజ్మా స్థానంలో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - సిద్దేశ్వర బాధ్యతలు బాబుల్ సుప్రియోకు న్యూఢిల్లీ : కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, భారీ పరిశ్రమల సహాయమంత్రి జీఎం సిద్దేశ్వర మంగళవారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. రాష్ట్రపతి భవన్‌కు పంపిన వీరి రాజీనామాలు ఆమోదం పొందాయి. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. గతవారం జరిగిన కేబినెట్ విస్తరణలో 75 ఏళ్లు దాటిన నజ్మా, మిశ్రాలకు విశ్రాంతి ఇస్తారనిప్రచారం జరిగింది. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం లేకుండానే పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఈ నేపథ్యంలోనే నజ్మా రాజీనామా ఆసక్తిగా మారింది. జూలై 5నే వీరి ద్దరూ రాజీనామా చేయాలనుకున్నా.. నజ్మా విదేశీ పర్యటనలో, సిద్దేశ్వర వేరే చోట ఉన్నం దున మంగళవారం రాజీనామా చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. నజ్మా స్థానం లో.. మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి పూర్తి బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక ఎంపీ సిద్దేశ్వరను కూడా జూలై 5నే రాజీనామా చేయమని కోర గా.. ఆ రోజున తన పుట్టినరోజువల్ల రాజీనామాను వాయిదా వేశారు. అయితే బాబుల్ సుప్రియోను పట్టణాభివృద్ధి సహాయ మంత్రినుంచి తప్పించి భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖ భాధ్యతలు అప్పగించారు. అయితే.. మిశ్రాకు 75 ఏళ్లు వచ్చినా.. యూపీ ఎన్నికల నేపథ్యంలో(బ్రాహ్మణ నేత) ఆయన్ను తప్పించలేదని తెలిసింది. -
వక్ఫ్‌బోర్డు విభజనకు చర్యలు
కేంద్ర మంత్రి నజ్మా హెప్తుల్లా వెల్లడి ఎంఎస్‌డీపీ కింద రూ. 38 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ భేటీ పడో పర్దేశ్, ఉడాన్ పథకాలను మంజూరు చేయాలని విజ్ఞప్తి హైదరాబాద్: తెలంగాణలో అమలవుతున్న మైనారిటీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తు ల్లా హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మంగళవారం ఢిల్లీలో ఆమెను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కేంద్రమంత్రికి వివరించారు. ఎంఎస్‌డీపీ కింద రాష్ట్రానికి రూ. 38 కోట్లు మంజూరు చేసేందుకు ఈ సందర్భంగా హెప్తుల్లా అంగీకరించారు. ఏపీ వక్ఫ్‌బోర్డును తక్షణమే రెండుగా విభజించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చా రు. దీనిపై 18వ తేదీన హైదరాబాద్‌లో ఇరురాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం కావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి సూచిస్తానన్నారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం) పథకం కింద శిక్షణ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. కేంద్రం నుంచి అందుతున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను యథావిధిగా కొనసాగించాలని నజ్మాను మహమూద్ అలీ కోరారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ర్టంలో స్కాలర్‌షిప్‌లకు ఆధార్‌కార్డుల అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పడో పర్దేశ్’, ‘ఉడాన్’, ‘ఉస్తాద్ హమారీ దారోహర్’ పథకాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు. టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, విశ్వేశ్వర్‌రెడ్డి, సీతారాం నాయక్, బాల్కసుమన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఉమర్ జలీల్, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షుకూర్ తదితరులు డిప్యూ టీ సీఎంతో పాటు ఉన్నారు.