అభివృద్ధికే పట్టం కట్టండి: వేముల ప్రశాంత్‌రెడ్డి 

Vote For Good Party On Balkonda In Nizamabad - Sakshi

సాక్షి, బాల్కొండ: గ్రామాల్లో అభివృద్ధి చేసిన నాయకుడికే పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ముప్కాల్‌ మండలం నాగంపేట్, రెంజర్ల, వెంచిర్యాల్‌ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి, 2014లో మీరు ఓట్లు వేసి గెలిపించిన తను ఇద్దరం ప్రస్తుతం పోటీలో ఉన్నామన్నారు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో గమనించాలన్నారు.

తనకంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తే అవతలి వ్యక్తికే ఓటు వేయవచ్చు అన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆడబిడ్డలకు మేనమామల అండగా ఉంటున్నారన్నారు. ప్రజలు మరోసారి దీవించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు ఆయనకు బోనాలతో, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు సామ వెంకట్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు ఆకుల రాజారెడ్డి,  టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌ రెడ్డికి పలు సంఘాల మద్దతు

 భీమ్‌గల్‌: మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ సంఘాల సభ్యులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రశాంత్‌రెడ్డికి తమ మద్దతు తెలియజేశాయి. మండలంలోని బెజ్జోరాకు చెందిన మహిళా సంఘాల సభ్యులు మద్దతు తెలపగా ముచ్కూర్‌ గ్రామానికి చెందిన ఆటో యూనియన్‌ సభ్యులు, బాపూజీనగర్‌కు చెందిన మోచీ సంఘం సభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరారు.  

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక  

కమ్మర్‌పల్లి: మండలంలోని హాసకొత్తూర్‌కు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, చౌట్‌పల్లికి చెందిన ట్రాక్టర్‌ ఓనర్స్‌ అండ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు మంగళవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈకార్యక్రమంలో  రాకేశ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top