మితిమీరిన వేగం.. వ్యాపారిపై కేసు | Volkswagen Car ride at 150 KM per hour and case registered | Sakshi
Sakshi News home page

మితిమీరిన వేగం.. వ్యాపారిపై కేసు

May 17 2015 6:32 PM | Updated on Sep 3 2017 2:14 AM

మితిమీరిన వేగం.. వ్యాపారిపై కేసు

మితిమీరిన వేగం.. వ్యాపారిపై కేసు

కారులో 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఓ యువ వ్యాపారి పోలీసులకు చిక్కాడు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): కారులో 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ ఓ యువ వ్యాపారి పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి దీపక్‌వంశీ తన వోక్స్ వ్యాగన్(ఏపీ 13ఏదీ 0045) కారులో ఆదివారం ఉదయం జూబ్లీచెక్‌పోస్టు నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు మితిమీరిన వేగంతో వెళుతుండగా... బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు గమనించారు. కేబీఆర్ పార్కు చౌరస్తాలో కారును నిలిపివేసి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన కారణంగా దీపక్‌వంశీపై కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement