ఇమాంపేటలో గ్రామజ్యోతి బహిష్కరణ | villegers oppose of gramajyothi | Sakshi
Sakshi News home page

ఇమాంపేటలో గ్రామజ్యోతి బహిష్కరణ

Aug 17 2015 12:22 PM | Updated on Sep 3 2017 7:37 AM

సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామస్తులు సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు.

సూర్యాపేట : సర్పంచ్ అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామస్తులు సోమవారం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరించారు. గ్రామజ్యోతి కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సోమవారం ఉదయం అధికారులు గ్రామానికి వెళ్లారు. కాగా వార్డు సభ్యులు, ప్రజలందరూ సంతకాలు చేసి తాము గ్రామజ్యోతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. తమ సర్పంచ్ రవినాయక్ గ్రామంలో ఉండటం లేదని, ఫలితంగా గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడంలేదని, గ్రామ సమస్యలు పరిష్కారం కావడంలేదని వారు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement