ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదు | vikaruddin case in aleru police station | Sakshi
Sakshi News home page

ఆలేరు పీఎస్ లో వికారుద్దీన్ తండ్రి ఫిర్యాదు

Apr 11 2015 12:19 PM | Updated on Sep 3 2017 12:10 AM

వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై ఆలేరు పోలీస్ స్టేషన్లో అతని తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు.

నల్లగొండ : వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్పై  ఆలేరు పోలీస్ స్టేషన్లో అతని తల్లిదండ్రులు శనివారం ఫిర్యాదు చేశారు.  వికారుద్దీన్ తండ్రి మహ్మమద్ అహ్మద్ తో పాటు ఎన్కౌంటర్లో మృతి చెందిన అనీఫ్ సోదరుడు కూడా పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని,  పోలీసులతో పాటు ఎస్కార్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వికారుద్దీన్ తండ్రి డిమాండ్ చేశారు.

కాగా వరంగల్-నల్లగొండ జిల్లా సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ అయిన విషయం తెలిసిందే. డీజేఎస్ వ్యవస్థాపకుడు, సిమి తీవ్రవాది వికారుద్దీన్ (38) తో పాటు అతని అనుచరులు సయ్యద్ అమ్జద్, ఎండీ జకీర్, ఎండీ హనీఫ్, జొహర్‌ఖాన్‌లు హతమయ్యారు.  వరంగల్ జిల్లా సెంట్రల్ జైలునుంచి ఓ కేసు నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement