కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వంశీ | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వంశీ

Published Wed, Mar 15 2017 2:51 AM

కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వం: వంశీ - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయానికి, సాగునీటి రంగానికి తక్కువగా నిధులను కేటాయించడం ద్వారా తమది రైతు వ్యతిరేక ప్రభుత్వమని సీఎం కేసీఆర్‌ చెప్పుకున్నారని ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించు కోకుండా, వ్యవసాయ సమస్యలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండా చేశారని ఆరోపించారు. కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు నిధులను కేటాయించకుండా ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

కల్వకుర్తి ఎత్తిపోతలను పూర్తి చేయకుంటే రైతులతో కలసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2,722 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. కమీషన్లు వచ్చే పథకాలకు, కార్యక్రమాలకే ఈ బడ్జెట్‌లో నిధులను కేటాయించారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement