'రేవంత్ దొరికిన దొంగ' | V Hanumantha rao takes on chandrababu and kcr | Sakshi
Sakshi News home page

'రేవంత్ దొరికిన దొంగ'

Jun 5 2015 1:41 PM | Updated on Sep 19 2019 8:28 PM

'రేవంత్ దొరికిన దొంగ' - Sakshi

'రేవంత్ దొరికిన దొంగ'

టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఎపిసోడ్పై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఎపిసోడ్ పై సీబీఐ విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్లకు లేఖ రాస్తున్నట్లు వీహెచ్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి దొరికిన దొంగ అని ఆయన అభివర్ణించారు.

అవినీతి వ్యతిరేక సమాజాన్ని నిర్మిస్తానంటూ చంద్రబాబు ఇటీవల విజయవాడలో నవ నిర్మాణ దీక్షలో ప్రకటించారు. అవినీతిని ఎలా నిర్మూలిస్తారో చెప్పాలనీ బాబును వీహెచ్ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణలో ఇతర పార్టీల  ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి ఫిరాయించారని... ఆ విషయం కూడ తెలవలసి ఉందని వీహెచ్ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement