ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి శివారులోని అనాజ్‌పురం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామానికి చెందిన పర్వతాలు(55), నర్సింహ(45) బైక్‌పై భువనగిరికి వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.