చెట్టును ఢీ కొన్న కారు : ఇద్దరు మృతి | Two killed in car accident in Khammam district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీ కొన్న కారు : ఇద్దరు మృతి

May 3 2014 8:44 AM | Updated on Aug 25 2018 5:41 PM

ఖమ్మం జిల్లా ఏదులాపురం వద్ద శనివారం కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

ఖమ్మం జిల్లా ఏదులాపురం వద్ద శనివారం కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  స్థానికలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రెండు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

అలాగే అదే జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక వద్ద బైక్, ఆటో ఢీ కొన్నాయి. ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం  నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement