breaking news
bike auto accident
-
మద్యం మత్తు.. అతివేగం
మల్యాల(చొప్పదండి): వారు వలసజీవులు .. ఆదివారం సెలవు దినం కావడంతో అవసరమైన వస్తువుల కొనుగోలుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆటోలో వస్తుండగా మద్యం మత్తులో వేగంగా బైక్ నడుపుతూ వచ్చిన వ్యక్తి వారి ఆటోని డీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యా ల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రా మంలో జగిత్యాల – కరీంనగర్ రహదారిపై ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండలం నూకపల్లిలో చేపట్టి నడబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కూలీలుగా పనిచేసేందుకు ఛత్తీస్గఢ్, ఒడిశా రా ష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది వల స వచ్చారు. అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. ఆదివారం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు సదాకర్ సా హూ (25), గోపాల్ షత్నమి (20)తో పా టు మరోముగ్గురు జగిత్యాల వెళ్లారు. కొనుగోళ్లు పూర్తయ్యాక ఓ ఆటోలో నూకపల్లికి బయలుదేరారు. ఆటో మల్యాల మండలం రాజారం గ్రామ సమీపంలోకి చేరుకోగా, అదేసమయంలో మల్యాలకు చెందిన బత్తిని సంజీవ్ తన మిత్రుడు కలికంటి మధుతో కలిసి బైక్పై జగిత్యాల వెళ్తున్నాడు. మద్యం మత్తులో ఉన్న సంజీవ్ బైక్ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. బైక్ బలంగా ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న గోపాల్ షత్నమి, సదాకర్ సాహూతోపాటు బైక్ నడుపుతున్న బత్తిని సంజీవ్ (26) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రాజారం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ గుర్రం జితేందర్తోపాటు మరో నలుగురు వలసజీవులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. బైక్ వెనక సీటులో కూర్చున్న మధు కూడా గాయపడ్డాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై చిరంజీవి సందర్శించారు. -
చెట్టును ఢీ కొన్న కారు : ఇద్దరు మృతి
ఖమ్మం జిల్లా ఏదులాపురం వద్ద శనివారం కారు చెట్టును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికలు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రెండు మృతదేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే అదే జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాక వద్ద బైక్, ఆటో ఢీ కొన్నాయి. ఒకరు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.