వేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ధరూర్ (రంగారెడ్డి) : వేగంగా వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. బోల్తా కొట్టిన ట్యాంకర్‌లో ఉన్న డీజిల్ లీక్ అవడంతో స్థానిక గ్రామాలకు చెందిన వారు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం ఒంటిమామిడి చెట్టు గ్రామంలో మంగళవారం జరిగింది.
హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ గ్రామ శివారులోని మూల మలుపు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న 12 వేల లీటర్ల డీజిల్ నేల పాలయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.