ఔటర్ రింగ్ రోడ్డుపై ఫార్చ్యూనర్ కారు బోల్తా పడడంతో ఇద్దరు టీడీపీ నాయకులు గాయపడ్డారు.
ఘట్‌కేసర్ టౌన్ (హైదరాబాద్) : ఔటర్ రింగ్‌రోడ్డుపై ఫార్చ్యూనర్ కారు బోల్తా పడడంతో ఓ టీడీపీ నాయకుడు మృతి చెందగా, మరో ఇద్దరు టీడీపీ నాయకులు గాయాలతో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ యాతకుమార్, ఘట్‌కేసర్ మండల టీడీపీ కార్యదర్శి మీసాల కృష్ణలు కారులో హైదరాబాద్ నుంచి ఘట్‌కేసర్ వైపు వెళుతుండగా మంగళవారం సాయంత్రం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికీ గాయాలు కాగా కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ యాతకుమార్ మృతి చెందారు.