హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

two days traffic restrictions in hyderabad - Sakshi

నేడు నగరానికి ఇరాన్‌ అధ్యక్షుడు

కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హసన్‌ రౌహనీ రెండు రోజుల పాటు నగరంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ కొత్వాల్‌ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలను వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు గల ప్రాంతాలు:
- గురువారం మధ్యాహ్నం 3.55 నుంచి 4.40 గంటల వరకు బేగం పేట విమానాశ్రయం- హాటల్‌ తాజ్‌కృష్ణ మధ్య
- శుక్రవారం ఉదయం 10.15 నుంచి 11 గంటల వరకు హాటల్‌ తాజ్‌కృష్ణ- సాలార్జంగ్‌ మ్యూజియం మధ్య, 
- శుక్రవారం మధ్యాహ్నం 12.15 నుంచి 12.50 గంటల వరకు సాలార్జంగ్‌ మ్యూజియం-మక్కా మసీదు 
- శుక్రవారం మధ్యాహ్నం 1.15 నుంచి 2.05 వరకు మక్కా మసీదు-హోటల్‌ తాజ్‌ కృష్ణ 
- శుక్రవారం సాయంత్రం 5.35 నుంచి 5.50 వరకు తాజ్‌కృష్ణ- బేగంపేట విమానాశ్రయం మధ్య ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

నేడు ఇరాన్‌ అధ్యక్షుడు రాక
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. హసన్ రౌహాని పర్యటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మక్కా మసీదులో శుక్రవారం నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Back to Top