ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ | Two children Kidnapped at toopran | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారుల కిడ్నాప్

Jan 17 2015 1:11 AM | Updated on Apr 4 2019 4:46 PM

తల్లితో కిడ్పాప్ కు గురైన ఇద్దరు చిన్నారులు - Sakshi

తల్లితో కిడ్పాప్ కు గురైన ఇద్దరు చిన్నారులు

పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని దుండగులు టాటా సుమోలో అపహరించుకుపోయి వదిలేసిన సంఘటన శుక్రవారం తూప్రాన్‌లో కలకలం రేపింది.

తూప్రాన్ : పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని దుండగులు టాటా సుమోలో అపహరించుకుపోయి వదిలేసిన సంఘటన శుక్రవారం తూప్రాన్‌లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పుల్లే కిష్టయ్య, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె పూజిత (10), కుమారుడు ప్రసాద్ (6)లు శుక్రవారం ఉదయం పట్టణంలోని గీతా అక్షర పబ్లిక్‌స్కూల్‌కు ఇంటి నుంచి బయలు దేరారు. అయితే పాఠశాలకు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకుని పిల్లల నోరు మూసి బలవంతంగా సుమోలో ఎక్కించారు.

అనంతరం పట్టణ శివారులోని అల్లాపూర్ చౌరస్తా వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వస్తున్న వారు చిన్నారులు ఏడుస్తున్న విషయాన్ని గమనించి వారిని వారి ఇంటికి చేర్చారు. అనంతర ం విషయాన్ని చిన్నారులు తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అపహరించిన వ్యక్తులు ఎవరై ఉంటారు..?, ఎందుకోసం అపహరించింటారన్న భయంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement