breaking news
two unidentified persons
-
ఇద్దరు చిన్నారుల కిడ్నాప్
తూప్రాన్ : పాఠశాలకు వెళ్లిన ఇద్దరు చిన్నారులను గుర్తుతెలియని దుండగులు టాటా సుమోలో అపహరించుకుపోయి వదిలేసిన సంఘటన శుక్రవారం తూప్రాన్‌లో కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన పుల్లే కిష్టయ్య, లక్ష్మి దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె పూజిత (10), కుమారుడు ప్రసాద్ (6)లు శుక్రవారం ఉదయం పట్టణంలోని గీతా అక్షర పబ్లిక్‌స్కూల్‌కు ఇంటి నుంచి బయలు దేరారు. అయితే పాఠశాలకు సమీపంలోకి రాగానే గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకుని పిల్లల నోరు మూసి బలవంతంగా సుమోలో ఎక్కించారు. అనంతరం పట్టణ శివారులోని అల్లాపూర్ చౌరస్తా వద్ద వదిలేసి పారిపోయారు. అటుగా వస్తున్న వారు చిన్నారులు ఏడుస్తున్న విషయాన్ని గమనించి వారిని వారి ఇంటికి చేర్చారు. అనంతర ం విషయాన్ని చిన్నారులు తల్లిదండ్రులకు విషయం చెప్పగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అపహరించిన వ్యక్తులు ఎవరై ఉంటారు..?, ఎందుకోసం అపహరించింటారన్న భయంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం
ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతిపై దాడి చేశారు. అనంతరం ఆ యువతి కాళ్లు కట్టేసి మరీ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్ర థానే జిల్లా షాహర్ పూర్ తాలుకాలోని ఘాటోగర్ గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు బుధవారం వెల్లడించారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్థానికుల సాయంతో తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. పలు సెక్షన్లు కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఆగంతకులు దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిందని తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.