యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం | Girl gangraped, two booked | Sakshi
Sakshi News home page

యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం

May 21 2014 12:44 PM | Updated on Sep 2 2017 7:39 AM

యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం

యువతిపై ఆగంతకులు సామూహిక అత్యాచారం

ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతిపై దాడి చేశారు.

ఇంట్లోకి ఆగంతకులు ప్రవేశించి ఒంటరిగా ఉన్న 22 ఏళ్ల యువతిపై దాడి చేశారు. అనంతరం ఆ యువతి కాళ్లు కట్టేసి మరీ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. మహారాష్ట్ర థానే జిల్లా షాహర్ పూర్ తాలుకాలోని ఘాటోగర్ గ్రామంలో ఆ ఘటన చోటు చేసుకుందని పోలీసులు బుధవారం వెల్లడించారు. అనంతరం ఆగంతకులు అక్కడినుంచి పరారైయ్యారని పోలీసులు తెలిపారు. బాధితురాలు స్థానికుల సాయంతో తమకు ఫిర్యాదు చేసిందని చెప్పారు.

 

పలు సెక్షన్లు కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అయితే ఆగంతకులు దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిందని తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుందని పోలీసులు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement