ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌

TSRTC Strike: OU Student Filed House Motion Petition In High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ పిటిషనర్‌ ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ సురేంద్ర సింగ్‌ ఆదివారం ఈ పిల్‌ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన వ్యాజ్యంలో కోరారు. ‘గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటికి అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ఇచ్చిన హామిని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

సమ్మె కారణంగా లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.’  అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు న్యాయమూర్తి వాదనలు విననున్నారు. కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసంలో విచారణ జరగనుంది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top