breaking news
house motion petition
-
TG: బీసీ రిజర్వేషన్లు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్ 27) విచారణ జరిపింది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్‌లతో ఏర్పాటైన బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతం దాటడం.. రాజ్యాంగ విరుద్ధమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని మయూర్‌రెడ్డి వివరించారు.ప్రభుత్వం తరపున ఏజీ వర్చువల్‌గా హాజరుకాగా.. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడులో రిజర్వేషన్లు 50 శాతం మించినట్టు ఉందని హైకోర్టు ప్రస్తావించింది. బీసీ బిల్లు గవర్నర్ దగ్గరికి ఎప్పుడు వెళ్లిందంటూ ధర్మాసనం ప్రశ్నించగా.. గవర్నర్ దగ్గరకు బిల్లు వెళ్లి నెలరోజులు దాటిందని ఏజీ సమాధానమిచ్చారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు?. రిజర్వేషన్లు పెంచుతూ జీవో ఎలా ఇస్తారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. మేం జోక్యం చేసుకోవద్దంటే.. ఎన్నికలకు వెళ్లమని హామీ ఇవ్వండి. 10 రోజుల వరకు ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టమని హామీ ఇవ్వాలన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆలోచన ఏంటో ఏజీ చెప్పాలని పేర్కొంది.‘‘ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పిటిషన్లు దాఖలైతే కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే.. పిటిషన్లు ఉన్నాయి కాబట్టి విచారించొచ్చు’’ అని హైకోర్టు పేర్కొంది. విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసిన ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి మరోసారి రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. మూడు రోజుల క్రితమే రిజర్వేషన్లపై ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా వేశారంటూ హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ క్రమంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం(సెప్టెంబర్ 26) జీవో విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ మాధవరెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. -
కోర్టు కళ్లుగప్పి కుప్పి గంతులు!
సాక్షి, అమరావతి, సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): మద్యం విధానంపై అక్రమ కేసులో ఆది నుంచీ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ వస్తున్న కూటమి సర్కారు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా బరి తెగింపు ధోరణితో ప్రవర్తించడం న్యాయవర్గాల్లో తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రిటైర్డ్ అధికారులు కాల్వ ధనుంజయరెడ్డి, పెళ్లకూరు కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ వారు జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కారు విఫల యత్నాలు చేసింది. కోర్టు ఆదేశించినప్పటికీ వారిని విడుదల చేయకుండా విజయవాడ జిల్లా జైలు వద్ద ఆదివారం ఉదయం మూడు గంటల పాటు హై డ్రామా నడిపింది.ఉదయం 6 గంటలకే రావాల్సిన జైలర్‌ను 9 గంటల వరకు రానివ్వకుండా చేసి ప్రభుత్వ పెద్దలు తెరచాటు కుతంత్రాలకు పాల్పడ్డారు. దొంగ కేసుల్లో ఇరికించి బయటకు రాకుండా చేసే కుట్రలకు మరింత పదును పెట్టారు. అయితే న్యాయవాదులు జైలు ఎదుట ధర్నాకు దిగటం.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం కావడం.. అప్రజాస్వామిక పోకడలపై అన్ని వర్గాలు ప్రశి్నస్తుండటంతో ఉలిక్కిపడిన ప్రభుత్వం హడావుడిగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి వారు జైలు నుంచి విడుదల కాకుండా ఉండేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించింది.అందుకు జైలు అధికారులు సహకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే విడుదలలో తీవ్ర జాప్యం చేశారు. మచిలీపట్నం నుంచి జైలు సూపరింటెండెంట్ బస్సులో వస్తున్నారంటూ కొద్దిసేపు ఈ నాటకాన్ని రక్తి కట్టించగా.. తీరా ఆయన వచ్చాక కూడా విడుదల చేయకుండా ఆలస్యం చేశారు. అయితే ఆ కుట్రలేవీ ఫలించకపోవడంతో ఏసీబీ కోర్టు తీర్పునకు అనుగుణంగా ఎట్టకేలకు ఉదయం 9.30 గంటల సమయంలో ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. గోవిందప్ప తదితరులకు ఏసీబీ కోర్టు శనివారం సాయంత్రం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కృష్ణమోహన్‌రెడ్డి తరఫు న్యాయవాది విష్ణువర్ధన్ సకాలంలో పూచీకత్తులను కోర్టుకు సమరి్పంచారు. ఈ నేపథ్యంలో రిలీజ్ ఆర్డర్‌ని జైలుకు పంపాలని ఆయన కోరగా ఏసీబీ కోర్టులోని ఓ అధికారి ఇందుకు ససేమీరా అన్నారు.దీంతో విష్ణువర్ధన్ ఈ విషయాన్ని న్యాయాధికారి భాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. రిలీజ్ ఆర్డర్‌ను కోర్టు అమీనా ద్వారా జైలు అధికారులకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే సదరు కోర్టు ఉద్యోగి మాత్రం మొండికేశారు. మిగిలిన ఇద్దరి పూచీకత్తులు సమరి్పస్తేనే మొత్తం ముగ్గురి రిలీజ్ ఆర్డర్లను జైలుకు పంపుతానని ఆ అధికారి స్పష్టం చేశారు. ఏకంగా న్యాయాధికారి ఆదేశాలను సైతం ఖాతరు చేయకుండా ఆ అధికారి సమయం ముగిసిపోయేంత వరకు తాత్సారం చేశారు. దీంతో కృష్ణమోహన్‌రెడ్డి శనివారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇదంతా స్పష్టంగా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురూ జైలు నుంచి విడుదలైతే హైకోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు తెర వెనుక ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా ఈ తతంగం నడిపించినట్లు చర్చ జరుగుతోంది. ప్లాన్ ‘బీ’ కూడా బెడిసికొట్టడంతో... ఏసీబీ కోర్టు ఉద్యోగి ద్వారా మొదటి ప్లాన్‌ను అమలు చేసిన ప్రభుత్వ పెద్దలు రెండో ప్లాన్‌లో భాగంగా శనివారం రాత్రి 9.30 గంటలకు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు బెయిల్ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచి్చన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలు చేసి అత్యవసర విచారణను కోరింది. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల మేరకు గోవిందప్ప తదితరులు ఆదివారం విడుదల కానుండటంతో దాన్ని అడ్డుకునేందుకు హౌస్ మోషన్ అస్త్రాన్ని ప్రయోగించింది.దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టును కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఈ హౌస్ మోషన్ పిటిషన్ల గురించి హైకోర్టు రిజిష్ట్రార్ (జుడీషియల్) ఫోన్ ద్వారా ప్రధాన న్యాయమూర్తి (సీజే) దృష్టికి తెచ్చారు. అయితే ఈ వ్యాజ్యాలపై ఇప్పటికప్పుడు అంత అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని భావించిన ప్రధాన న్యాయమూర్తి అనుమతిని నిరాకరించారు. వీటిని సోమవారం అనుబంధ కేసుల విచారణ జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. కోర్టు కేసుల విచారణ జాబితా శుక్రవారం సాయంత్రమే సిద్ధమైపోయినప్పటికీ, అత్యవసరం దృష్ట్యా ఆ వ్యాజ్యాలను అనుబంధ జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరపనున్నారు. హౌస్‌మోషన్ అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరించడంతో బాలాజీ గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ పెద్దల రెండో ప్లాన్ కూడా బెడిసికొట్టింది. ఎప్పుడైతే హైకోర్టు అత్యవసర విచారణకు నిరాకరించిందో ఇక అప్పుడు జైలు అధికారులు చేసేదేమీ లేక ఏసీబీ కోర్టు తీర్పు మేరకు గోవిందప్ప తదితరులను జైలు నుంచి విడుదల చేశారు. ఈ ప్రభుత్వానికి న్యాయం, చట్టం అంటే గౌరవం లేదు: ధనుంజయరెడ్డి కోర్టు ఆదేశాలన్నా ఈ ప్రభుత్వానికి లెక్క లేదని.. న్యాయం, చట్టం అంటే ఏమాత్రం గౌరవం లేదని అనంతరం ధనుంజయరెడ్డి పేర్కొన్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఉద్దేశపూర్వకంగానే విడుదలలో జాప్యం చేశారని చెప్పారు.జైలు ఎదుట న్యాయవాదులు,నేతల బైఠాయింపు..వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణకుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సుధాకర్ బాబు, పార్టీ నేతలు, న్యాయవాదులు ఉదయం ఆరు గంటల నుంచే పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకుని నిరీక్షించారు. కోర్టు బెయిల్ ఇచ్చినా 15 గంటల పాటు జైలులోనే నిర్బంధించడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటలు గడిచిపోతున్నా విడుదల చేయకపోవడంతో జైలు సూపరింటెండెంట్ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. జైళ్ల శాఖ డీఐజీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జైలు అధికారుల తీరుపై పిటిషనర్ల తరపు న్యాయవాదులు విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్ తీవ్ర నిరసన తెలిపారు. 15 గంటలు అక్రమంగా జైల్లో ఉంచారు ముగ్గురికీ శనివారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరు గంటలలోపే జైలు వద్దకు వచ్చాం. ఆదివారం ఉదయం 6.30 గంటలకు విడుదల చేస్తామన్నారు. విడుదల చేయకుండా అధికారులు కావాలనే తాత్సారం చేశారు. 15 గంటలకు పైగా ముగ్గురిని జైలులో అక్రమంగా ఉంచారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. – చంద్రగిరి విష్ణువర్థన్, పి.నిర్మల్ రాజేష్, న్యాయవాదులు కోర్టు ఉత్తర్వుల ధిక్కరణే ఏసీబీ కోర్టు ముగ్గురికీ బెయిల్ మంజూరు చేసింది. జైలు అధికారులకు శనివారం సాయంత్రమే మెయిల్ ద్వారా, నేరుగా అందజేసింది. ఫోన్లో జైలు సూపరింటెండెంట్‌ను సంప్రదించినా సకాలంలో విడుదల చేయకుండా జాప్యం చేశారు. ఇది పూర్తిగా కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ కిందకే వస్తుంది. జైలు నియమావళి ప్రకారం బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం లోపల ఉంచినా అక్రమ నిర్బంధమే అవుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రవర్తించారు. – టి.నాగార్జునరెడ్డి, న్యాయవాది పస లేని అక్రమ కేసు.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కోర్టులంటే లెక్కలేదు. ఆ ముగ్గురూ జైలు నుంచి బయటకు రాకుండా లంచ్ మోషన్ దాఖలు చేసేందుకే విడుదలలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేశారు. కోర్టు ఉత్తర్వులను కూడా జైలు అధికారులు పట్టించుకోరా? ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌ను ఉన్నట్లుగా చిత్రీకరించి అక్రమంగా జైల్లో పెట్టారు. చార్జ్ïÙట్ అంతా తప్పుల తడక. ముగ్గురికీ బెయిల్ రావడంతో ఈ అక్రమ కేసులో పసలేదని ప్రభుత్వం భయపడుతోంది. చంద్రబాబు చెప్పినట్లుగా సిట్ అధికారులు కథలు అల్లుతున్నారు. న్యాయవాదులు సైతం ఆందోళన చేయాల్సిన దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపురించింది. గతంలో వంశీపై బనాయించిన కేసులో కూడా బెయిల్ వచ్చినా పట్టించుకోలేదు. చంద్రబాబు కక్ష సాధింపు ధోరణిని ప్రజలు గమనిస్తున్నారు. – అంబటి రాంబాబు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత -
చంద్రబాబు న్యాయవాదుల పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు..
-
ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద టీడీపీ లాయర్ల హంగామా
సాక్షి, అమరావతి: విజయవాడలో ఏసీబీ కోర్టు జడ్జి ఇంటి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు హంగామా సృష్టించారు. టీడీపీ న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి జడ్జిని కలిసేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగారు. చంద్రబాబు అరెస్టుకు సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ ఇచ్చేందుకు రాత్రి 12 గంటల సమయంలో టీడీపీ న్యాయవాదులు వెళ్లారు. పిటిషన్ తీసుకునేందుకు జడ్జి నిరాకరించారు. కోర్టుకే రావాలని సూచించారు. జడ్జి సూచనల మేరకు పోలీసులు న్యాయవాదులను బయటకు వెళ్లాలని కోరారు. దీంతో లాయర్లు పోలీసులతో గొడవకు దిగారు. జడ్జి చెప్పడం వల్లే తాము బయటకు వెళ్లాలంటున్నామని పోలీసులు చెబుతున్నా వినలేదు. -
రాహుల్ ఓయూ పర్యటనపై హౌజ్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ విద్యార్థి సంఘాలు, పార్టీ నేతల పోటాపోటీ విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో.. మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బుధవారం పర్యటన అనుమతి వ్యవహారంపై మరో పిటిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ ఓయూ పర్యటనపై మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓయూ వీసీ, హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ పిటిషన్లో పేర్కొంది. దీంతో కాంగ్రెస్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని వీసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. మే 7వ తేదీన ఓయూలో పర్యటించి.. విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆంక్షల నేపథ్యంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అందుకు అనుమతి నిరాకరించారు. ఈ విషయమై ఇదివరకే తెలంగాణ కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించగా, నిర్ణయం వీసీదేనని హైకోర్టు సైతం పేర్కొంది. చదవండి: ఓయూకొచ్చి స్టూడెంట్స్‌తో నైట్ క్లబ్ గురించి చెప్తారా? -
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
-
కౌంటింగ్‌పై ఉత్కంఠ: హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు
సాక్షి, హైదరాబాద్: మరికాసేపట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో.. పెన్నుతో టిక్‌పెట్టినా ఓటేసినట్లేనని ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది. ఆ వెంటనే ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ శ్రేణులు హైకోర్టులో హౌజ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశాయి. మరికాసేపట్లో దీనిపై వాదనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఒట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. -
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
-
ఆర్టీసీ సమ్మెపై హౌస్ మోషన్ పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. తక్షణమే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించేలా ఆదేశించాలంటూ పిటిషనర్ ఓయూ రీసెర్చ్ స్కాలర్ సురేంద్ర సింగ్ ఆదివారం ఈ పిల్ దాఖలు చేశారు. అలాగే కార్మికుల సమస్యలపై కమిటీ వేయాలని ఆయన తన వ్యాజ్యంలో కోరారు. ‘గతంలో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీని ఇప్పటికి అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మెకు దిగారు. ఇచ్చిన హామిని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. సమ్మె కారణంగా లక్షలమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.’ అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు న్యాయమూర్తి వాదనలు విననున్నారు. కుందన్‌బాగ్‌లోని జడ్జి నివాసంలో విచారణ జరగనుంది. పిటిషనర్ తరఫున న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ సమ్మెపై సమీక్ష నిర్వహించనున్నారు. -
ముద్రగడ దీక్షపై హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్
ముద్రగడ దీక్ష నేపథ్యంలో పోలీసు ఆంక్షలపై ఆయన కుమారుడు బాలు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం.. దానిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది. కాగా, ముద్రగడను అరెస్టు చేసినట్లు చెబుతున్నా, ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదని.. కేవలం 144 సెక్షన్ అమలుచేస్తున్నట్లు మాత్రమే చెబుతున్నారని పిటిషన్లో చెప్పారు. జిల్లాలో పోలీసు బందోబస్తు తీవ్రంగా పెట్టి భయాందోళనలకు గురి చేస్తున్నారని, కనీసం పిల్లలను స్కూళ్లకు కూడా వెళ్లనివ్వడం లేదని తెలిపారు. బంధువులను కూడా తమ ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, రాజ్యాంగం తమకు కల్పించిన ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని ముద్రగడ కుమారుడు బాలు తమ న్యాయవాది ద్వారా కోర్టుకు తెలిపారు. రాజ్యాంగ హక్కులు తమకు కల్పించేలా చూడాలని కోరారు. తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి అనుచితంగా ప్రవర్తించారని బాలు చెప్పారు. -
కాసేపట్లో వైఎస్ జగన్ దీక్షపై కార్యాచరణ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26 నుంచి గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక దీక్ష విషయంపై కాసేపట్లో కార్యాచరణ వెలువడనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వైఎస్ఆర్ సీపీ నాయకులు సమావేశమై చర్చించనున్నారు. వైఎస్ జగన్ దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ విషయంపై రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచించింది. కాగా వైఎస్ జగన్ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్ఆర్ సీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీక్షకు అనుమతి ఇచ్చేలా ప్రభుత్వాని ఆదేశించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరింది. అయితే రెగ్యులర్ కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.