హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి... | TRS plenary meeting at LB stadium | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి...

Apr 17 2015 4:08 PM | Updated on Sep 3 2017 12:25 AM

హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి...

హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి...

ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు.

హైదరాబాద్: ఈ నెల 24న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహిస్తామని  ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు తెలిపారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...ఈ ప్లీనరీ సమావేశాలకు దాదాపు 40 వేల మంది హాజరవుతారని వెల్లడించారు.

ఈ ప్లీనరీలో పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ను గులాబీరంగు మయం చేసి గ్రేటర్లో టీఆర్ఎస్ సత్తా చాటుతామని పద్మారావు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement