'తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది' | trs mla srinivasgoud fires on bjp | Sakshi
Sakshi News home page

'తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోంది'

Aug 31 2015 6:46 PM | Updated on Mar 29 2019 9:07 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి. శ్రీనివాసగౌడ్ విమర్శించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి. శ్రీనివాసగౌడ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు రావాల్సిన ప్యాకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన ఉనికిని కాపాడుకోవటానికే సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement