69 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు..కాంగ్రెస్‌లోకి..చేరిక | Trs Leaders Join In Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన జానంపేట సర్పంచ్‌

Apr 7 2018 11:44 AM | Updated on Mar 18 2019 7:55 PM

Trs Leaders Join In Congress Party - Sakshi

అడ్డాకుల: కాంగ్రెస్‌లో చేరిన నాయకులతో డీకే అరుణ

మూసాపేట : మండలంలోని జానంపేట సర్పంచ్‌ పొన్నకంటి చెన్నమ్మ, ఆమె భర్త వెంకటయ్య శుక్రవారం  తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరారు. ఇద్దరు వార్డు సభ్యులతో సహా అచ్చాయపల్లి, తాళ్లగడ్ద, జానంపేటకు చెందిన 69 మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి డీకే అరుణ స్వగృహానికి వెళ్ళి దేవరకద్ర నియోజక వర్గ ఇంచార్జి పవన్‌కుమార్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తమపై చిన్న చూపు చూస్తూ, తన అనుచర వర్గానికి మాత్రమే కొమ్ము కాస్తున్నారని, అందుకే తెలంగాణ ఇచ్చిన జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో  చేరానన్నారు. కార్యక్రమంలో  సురేందర్‌రెడ్డి,  బాల నర్సింహులు,నాగిరెడ్డి, శెట్టిశేఖర్, గోవర్దన్,  రాంకుమార్, సమరసింహారెడ్డి. తాజూద్దీన్, జమీర్, రాజెందర్‌రెడ్డి, నర్సింహా  పాల్గొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం 
అడ్డాకుల : టీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లినందున రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రానుందని ఆపార్టీ మండల అధ్యక్షుడు, కందూర్‌ సర్పంచ్‌ కారెడ్డి నాగిరెడ్డి పేర్కొన్నారు. కందూర్‌ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు నాగిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement