గోవా జైల్లో టీఆర్‌ఎస్‌ నేతలు | TRS leaders in Goa jail | Sakshi
Sakshi News home page

సరదా కోసం వెళ్లి.. కటకటాలపాలై..

Jan 5 2018 1:47 AM | Updated on Jan 5 2018 3:15 AM

TRS leaders in Goa jail - Sakshi

పటాన్‌చెరు: సరదాగా గడుపుదామని గోవా వెళ్లిన కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు స్థానికులతో గొడవపడి కటకటాలపాలయ్యారు. కొత్త సంవత్సర సంబరాల్లో భా గంగా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండ లం కిష్టారెడ్డిపేట మాజీ సర్పంచ్‌ దేవానందం సహా 16 మంది టీఆర్‌ఎస్‌ నేతలు గత నెల 29న గోవా, షిర్డీ, ఇతర ప్రాంతాలకు టూర్‌ వెళ్లారు.

ఈ నెల 1న గోవాకు చేరుకున్నారు. కలంగుట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తివైవాడో గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. స్థానికులతో వివాదం చోటుచేసుకుంది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిని విడిపించేందుకు దేవానందం సోదరుడు శ్రీకాంత్‌ న్యాయవాదితో కలసి వెళ్లినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement