హైకోర్టుకు చేరిన సంగీత వివాదం

TRS expel leader wife sangeetha approaches high court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తున్న సంగీత వ్యవహారం తాజాగా హైకోర్టుకు చేరింది. బోడుప్పల్‌లోని ఇంటి నుంచి సంగీతను ఖాళీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె అత్తింటివారు  న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సంగీత బలవంతంగా ఇంటి తాళాలు పగులగొట్టి న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, తమను ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటుందని.. ఇంటి ముందు దీక్ష కొనసాగించవద్దని ఆదేశించాలని, సంగీత అత్తింటి వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో, సంగీతకు నోటిసులు అందాయి. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలంటూ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత శ్రీనివాస్ రెడ్డి ఇంటి ముందు ఆయన రెండో భార్య సంగీత చేస్తున్న పోరాటం 20వ రోజుకు చేరుకుంది. అత్తింటి వారు చేసిన దాడికి నిరసనగా తనకు న్యాయం కావాలని సంగీత గత ఇరవై రోజులుగా దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. సంగీతకు రోజురోజుకూ మహిళా సంఘాల మద్ధతు పెరుగుతూనే ఉన్నా.. ఆమె ఆరోగ్యం మాత్రం రోజురోజుకూ క్షీణిస్తుంది. ఇప్పటికే సంగీత భర్త, అత్త  జైలులో ఉండగా.. మామ బాల్రెడ్డికి కూడా కోర్టు బెయిల్ రద్దు చేసింది. సంగీత మాత్రం న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top