ట్రాన్స్‌జెండర్లను మనుషులుగా గుర్తించాలి

Transgender Chandramukhi on Special Act For Transgenders - Sakshi

గోషామహల్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్‌ చంద్రముఖి

సుందరయ్యవిజ్ఞానకేంద్రం:  తెలంగాణలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక చట్టం లేకపోవడం బాధాకరమని  బీఎల్‌ఎఫ్‌ గోషామహాల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్స్‌ రాష్ట్ర అధ్యక్షులు చంద్రముఖి అన్నారు. నాల్సా తీర్పును అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజెఎఫ్‌),  హైదరాబాద్‌ యూనియన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌(హెచ్‌యూజె) సంయుక్త ఆధ్వర్యంలో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రముఖి మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్లను కనీసం మనుషులుగా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. తల్లిదండ్రుల ఆదరణకు నోచుకోకుండా భిక్షాటన చేయాల్సి వస్తోందని వాపోయారు. ఉద్యోగ అవకాశాలు  కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాల్లో ట్రాన్స్‌జెండర్స్‌కు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నా. 

రాబోయే రోజుల్లో ట్రాన్స్‌జెండర్స్‌ అందరం కలిసి ఒక పార్టీ పెడతామని చెప్పారు. మానవ హక్కులే ట్రాన్స్‌జెండర్స్‌ హక్కులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొండా సురేఖ మా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా ఉనికిని చాటుకోవడం కోసం పోటీ చేస్తున్నామని వివరించారు.  గోషామహాల్‌ నియోజకవర్గంలో హిజ్రాలకు  ఎంతో చరిత్ర ఉందని, అందుకే ఇక్కడినుంచి పోటీచేస్తున్నానన్నారు.   టీడబ్ల్యూజేఎఫ్‌ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగి ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, హెచ్‌యూజే అధ్యక్షులు   బిఎల్‌ఎఫ్‌తో కలిసి పోరాటాలు చేశామని, వారి సంపూర్ణమద్దతు తమకు ఉందన్నారు. ట్రాన్స్‌జెండర్లు ఓటింగ్‌కు వెళితే ఓటింగ్‌కు హేళన చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని,  అందుకే  చాలామంది పోలింగ్‌కేంద్రాల వద్దకే వెళ్లడం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top