సీఈసీకి ఉత్తమ్ కుమార్ లేఖ | TPCC Chief Uttam Kumar Reddy writes letter to Central Election Commission | Sakshi
Sakshi News home page

సీఈసీకి ఉత్తమ్ కుమార్ లేఖ

May 5 2016 1:58 PM | Updated on Aug 14 2018 4:34 PM

పాలేరు ఉపఎన్నికపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికపై తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఈ ఉప ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలుస్తుండటంతో ఎన్నికను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని ఆయన తన లేఖలో కోరారు. నియోజకవర్గం పోలింగ్ బూత్ లలో ప్రతి ఈవీఎంకు ప్రింటర్లను అమర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఎన్నికల సంఘం విధులు నిర్వహించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement