బ్యాంకు ఉద్యోగులకు 2012 నుంచి పెండింగ్ లో ఉన్న వేతన సవరణను వెంటనే చేపట్టాలని రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికాంత్ అన్నారు.
స్టేషన్ మహబూబ్‌నగర్: బ్యాంకు ఉద్యోగులకు 2012 నుంచి పెండింగ్ లో ఉన్న వేతన సవరణను వెంటనే చేపట్టాలని రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికాంత్ అన్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) వైఖరిని నిరసిస్తూ యూనెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుమేరకు బుధవారం స్థానిక మెట్టుగడ్డ రీజినల్ బిజినెస్ కార్యాల యం ఎదుట ఒక్క రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐబీఏ గతంలో యూఎఫ్‌బీయూతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని నీరుగార్చుతూ రెండేళ్లుగా వేతన సవరణను పెండింగ్‌లో పెడుతున్నదన్నారు.
దీనిపై పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదన్నారు. 23 నుంచి 25శాతం వేతన సవరణను ప్రకటించాలని కోరగా, కేవలం 11శాతం మాత్రమే పెంచుతామనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అరుుతే బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించా రు. బ్యాంకుల పరిరక్షణకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు.
ఇందులో భాగంగా వచ్చేనెల 2, 3, 4, 5 తేదీల్లో సమ్మెలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరి ష్కరించకపోతే నిరవధిక సమ్మెలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, ఎస్‌బీహెచ్ యూని యన్ నేత రమణతోపాటు ఆంధ్రాబ్యాంక్, ఇతర బ్యాంకుల సిబ్బంది, ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.