breaking news
The community
-
వేతన సవరణ చేపట్టాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: బ్యాంకు ఉద్యోగులకు 2012 నుంచి పెండింగ్ లో ఉన్న వేతన సవరణను వెంటనే చేపట్టాలని రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవికాంత్ అన్నారు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) వైఖరిని నిరసిస్తూ యూనెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుమేరకు బుధవారం స్థానిక మెట్టుగడ్డ రీజినల్ బిజినెస్ కార్యాల యం ఎదుట ఒక్క రోజు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐబీఏ గతంలో యూఎఫ్‌బీయూతో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని నీరుగార్చుతూ రెండేళ్లుగా వేతన సవరణను పెండింగ్‌లో పెడుతున్నదన్నారు. దీనిపై పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదన్నారు. 23 నుంచి 25శాతం వేతన సవరణను ప్రకటించాలని కోరగా, కేవలం 11శాతం మాత్రమే పెంచుతామనడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అరుుతే బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించా రు. బ్యాంకుల పరిరక్షణకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఇందులో భాగంగా వచ్చేనెల 2, 3, 4, 5 తేదీల్లో సమ్మెలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరి ష్కరించకపోతే నిరవధిక సమ్మెలకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్, ఎస్బీహెచ్ యూని యన్ నేత రమణతోపాటు ఆంధ్రాబ్యాంక్, ఇతర బ్యాంకుల సిబ్బంది, ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
విద్యాశాఖలో ‘గుర్తింపు సంఘం’!
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంఘాలు హైదరాబాద్: విద్యాశాఖలో గుర్తింపు సం ఘం అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఏ శాఖ లోనూ, దేశంలో ఏ రాష్ర్టంలోనూ లేని విధంగా రాష్ర్టంలోని విద్యా శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సంఘాలు అవసరమా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆర్టీసీ తరహాలో ఎన్నికలు నిర్వహించి గుర్తింపు సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్న ట్టు సమాచారం. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి కూడా వెళ్లినట్టు తెలి సింది. మరోవైపు ప్రధానమైన రెండు మూడు సంఘాలు ఉన్నా సరిపోతుందనే భావనా అధికారుల్లో ఉంది. ప్రస్తుతం విద్యాశాఖలో 25కి పైగా సంఘాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జరిగాయి. అయితే ఆయన మరణం తరువాత ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. అప్పట్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన పూనం మాలకొం డయ్య ‘గుర్తింపు సంఘం’పై కొంత కసరత్తు కూడా చేశారు. దీనిని కొన్ని సంఘాలు స్వాగతి స్తుండగా, కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.