విద్యాశాఖలో గుర్తింపు సంఘం అంశం మళ్లీ తెరపైకి వస్తోంది.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంఘాలు
హైదరాబాద్: విద్యాశాఖలో గుర్తింపు సం ఘం అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఏ శాఖ లోనూ, దేశంలో ఏ రాష్ర్టంలోనూ లేని విధంగా రాష్ర్టంలోని విద్యా శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సంఘాలు అవసరమా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆర్టీసీ తరహాలో ఎన్నికలు నిర్వహించి గుర్తింపు సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్న ట్టు సమాచారం. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు దృష్టికి కూడా వెళ్లినట్టు తెలి సింది.
మరోవైపు ప్రధానమైన రెండు మూడు సంఘాలు ఉన్నా సరిపోతుందనే భావనా అధికారుల్లో ఉంది. ప్రస్తుతం విద్యాశాఖలో 25కి పైగా సంఘాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ జరిగాయి. అయితే ఆయన మరణం తరువాత ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. అప్పట్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా పనిచేసిన పూనం మాలకొం డయ్య ‘గుర్తింపు సంఘం’పై కొంత కసరత్తు కూడా చేశారు. దీనిని కొన్ని సంఘాలు స్వాగతి స్తుండగా, కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.