‘ముంపు’ ఉద్యోగులకు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి | To giving job in district for caved employees | Sakshi
Sakshi News home page

‘ముంపు’ ఉద్యోగులకు జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలి

Nov 8 2014 3:40 AM | Updated on Sep 6 2018 3:01 PM

ముంపు మండలాల్లోని ఉద్యోగులకు ఈ జిల్లాలోనే పోస్టింగ్...

ఖమ్మం జెడ్పీ సెంటర్: ముంపు మండలాల్లోని ఉద్యోగులకు ఈ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ పంచాయతీరాజ్(టీ-పీఆర్) ఉద్యోగుల సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు జనగాం నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం రాష్ర్ట కార్యవర్గ సమావేశం శుక్రవారం నగరంలోని సంఘం కార్యాలయంలో జరిగింది.

ఆయన మాట్లాడుతూ..
ఈ జిల్లో ఉద్యోగులకు తెలంగాణ వచ్చిన ఆనందం మిగల్లేదని, ఆందోళన ఎక్కువైందని అన్నారు. వారు పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన ఇక్కడి ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరముందన్నారు. ముంపు మండలాల్లోని 34 మంది ఉద్యోగులకు ఈ జిల్లాలోనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు.

ఉద్యోగులకు పీఆర్‌సీని వెంటనే అమలుచేయాలని, ప్రతి మండలంలో ఈజీఎస్ కింద సీనియర్ అసిస్టెంట్ పోస్టు, ఎన్నికల నిర్వహణకు ఒక పోస్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసరా పథకంపై మండల పరిషత్ ఉద్యోగులందరికీ శిక్షణ ఇస్తే అమలులో పారదర్శకత ఉంటుందన్నారు.

 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగోన్నతులకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు  పంచాయతీరాజ్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఫారెన్ సర్వీస్సుల్లో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు ెహ ల్త్ కార్డుల జారీలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించినట్టు చెప్పారు.

జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఈ సమావేశం తీర్మానించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు నడింపల్లి వెంకటపతిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎన్.దర్శన్, అసోసియేట్ అధ్యక్షులు జి.శ్రీనివాస్‌రావు, సాధుల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి రాంకృష్ణారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు జి.అనిల్‌కుమార్, షరీఫ్, యాదగిరి, ఎంజేఆర్.బాబు, చంద్రమౌళి, శ్రీహరి, మల్లెల రవీంద్రప్రసాద్,  జిల్లా ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, నాయకులు గౌసుద్దీన్, మీరా, రాజేష్, రామకృష్ణారెడ్డి  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement