జ్వరంతో ముగ్గురి మృతి | three members are dead due to fever | Sakshi
Sakshi News home page

జ్వరంతో ముగ్గురి మృతి

Dec 1 2014 2:45 AM | Updated on Sep 2 2017 5:24 PM

రామన్నపాలెం గ్రామంలో ఒకే రోజున.. కేవలం గంటల వ్యవధిలోనే జ్వరంతో ముగ్గురు మృతిచెందారు. దీంతో, ఈ గ్రామస్తులు తీవ్ర భయూందోళనతో వణకుతున్నారు.

రామన్నపాలెం (వేంసూరు): రామన్నపాలెం గ్రామంలో ఒకే రోజున.. కేవలం గంటల వ్యవధిలోనే జ్వరంతో ముగ్గురు మృతిచెందారు. దీంతో, ఈ గ్రామస్తులు తీవ్ర భయూందోళనతో వణకుతున్నారు. గ్రామస్తులు తెలిపిన ప్రకారం... ఈ గ్రామానికి చెందిన రామినేని సత్యం(48) కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో నోటి నుంచి నురగతో మృతిచెందాడు.ఇతని మృతదేహాన్ని చూసేందుకు అదే వీధిలో ఉంటున్న అంగిడి గోపయ్య(55), బండి వెంకటేశ్వరరావు(45) వచ్చారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయూరు.

ఆ తరువాత కొద్దిసేపటికి అంగిడి గోపయ్యకు ఒకేసారి జ్వరం పెరిగింది. తీవ్రంగా అస్వస్థుడైన అతనిని కుటుంబీకులు కృష్ణా జిల్లా తిరువూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలో (11 గంటల సమయంలో) మృతిచెందాడు.

 వెంకటేశ్వరరావుది కూడా ఇదే పరిస్థితి. రామినేని సత్యం మృతదేహాన్ని చూసేందుకు వచ్చి అక్కడే కొద్దిసేపు ఉన్నాడు. ఆ తరువాత తన ఇంటికి వెళ్లిపోయూడు. కొద్దిసేపటి తరువాత జ్వరం పెరగడంతో తీవ్రంగా అస్వస్థుడయ్యూడు. కుటుంబీకులు తిరువూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అతడు అక్కడే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతిచెందాడు.

ఒకే వీధికి చెందిన ముగ్గురు వ్యక్తులు గంటల వ్యవధిలో మృతిచెందడంతో గ్రామస్తులు భయంతో వణుకుతున్నారు. ఈ గ్రామంలో మరికొందరు కూడా జ్వరంతో బాధపడుతున్నారు. మృతుల కుటుంబీకులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement