దొంగతనాలకు కుటుంబం బలి | Theft to the family in died | Sakshi
Sakshi News home page

దొంగతనాలకు కుటుంబం బలి

Nov 16 2014 2:01 AM | Updated on Sep 2 2017 4:31 PM

దొంగతనాలకు కుటుంబం బలి

దొంగతనాలకు కుటుంబం బలి

ఒకే కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు. వృత్తి వ్యవసాయమే అయి నా.. దొంగతనం ప్రవృత్తిగా మారింది.

చోరీల్లో చిక్కి ఒకే ఇంట్లో ఐదుగురు అన్నదమ్ములు మృతి
వీధినపడిన భార్యాపిల్లలు

 
తిమ్మాజీపేట (బిజినేపల్లి) : ఒకే కుటుంబంలో ఐదుగురు అన్నదమ్ములు. వృత్తి వ్యవసాయమే అయి నా.. దొంగతనం ప్రవృత్తిగా మారింది. మొద టి చిన్న చిన్న అవసరాల కోసం చోరీలకు పాల్పడిన వారే పెద్దపెద్ద నేరాలను ఎంచుకున్నారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో కొందరు.. శిక్ష ను అనుభవిస్తూ మరికొందరు.. ఇలా ఐదుగురూ తమ ప్రాణాలు కోల్పోయారు. మండలంలోని ఇప్పలపల్లి పంచాయతీ ఇంద్రనగర్ తండాకు చెందిన కేతావత్ సక్రుకు ఐదుగురు కొడుకులు. ఓ దొంగతనం కేసులో చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్న చివరి కొడుకు తార్యా ఈ నెల 12న గుండెపోటుతో జైలులోనే మృతిచెందాడు. ఈ ఘటన తో ఈ నేపథ్యంలో ఇంద్రనగర్ తండాను సందర్శించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకెళ్తే.. తండాకు చెందిన కేతావత్ సక్రుకు జాప్లా, తౌర్య, ఇస్నా, వసురాం(వర్ష), తార్యా ఐదుగురు కొడుకులు. 20ఏళ్ల క్రితం ఓ దొంగతనం కేసు విషయంలో అప్పటి జడ్చర్ల సీఐ, ఎస్‌ఐతో కలిసి వసురాం(వర్ష)ను పట్టుకోవడానికి ఇంద్రనగర్ తండాకు వెళ్లగా.. వసురాం పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన ఎస్‌ఐ పిస్టల్‌ను అతనిపై ఎక్కుపెట్టాడు. దాన్ని లాక్కొని వసురాం ఎస్‌ఐపై కాల్పులు జరపడంతో బుల్లెట్ తగిలి అతని అన్న జాప్లా(35) అక్కడికక్కడే మృతిచెందా డు. రెండో కొడుకు తౌర్య(30) మరికొందరితో కలిసి జడ్చర్ల మండలం చర్లపల్లిలో దొం గతనానికి వెళ్లగా.. స్థానికుల దాడిలో ప్రాణా లు విడిచాడు. మూడో కుమారుడు ఇస్నా(31) పదిహేనేళ్ల క్రితం దొంగతనానికి వెళ్ల గా.. నస్రుల్లాబాద్ వద్ద గ్రామస్తులు కొట్టిచంపారు. నాలుగో కొడుకు వసురాంకు అతనితో కలిసి దొంగతనం చేసే ముఠాలోని కొందరు సభ్యులు మధ్య విభేదాలు తలెత్తాయి. తిమ్మాజీపేట సమీపంలో అతని సహచరులే నాటు తుపాకీతో కాల్చిచంపారు.

చర్లపల్లి జైలులో చివరివాడు..

సక్రు చివరి కొడుకు తార్యా(39) 2009లో బాలానగర్ మండలం తిర్మలగిరి పరిధిలోని తండా సమీపంలో చోరీకి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన వ్యక్తిని హత్యచేసి నగలను దోచుకెళ్లాడు. అప్పట్లో బాలానగర్ పోలీ సులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. తార్యానాయక్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్షను అనుభవిస్తూ ఈ నెల 12న గుండెపోటుతో మృతిచెందాడు.

వీధినపడిన భార్యాపిల్లలు

మృతుడు జాప్లా, సీత దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. అలాగే తౌర్య, పన్నికి ఓ కూతురు ఉంది. ఇస్నా, చాం ది దంపతులకు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వసురాం(వర్ష), అస్లిలకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కాగా, చివరివాడు తార్యా, బుచ్చికి కొడుకు, కూతురు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement