‘టీఆర్‌ఎస్ అధ్యక్షుడిని మార్చాలి’ | "The President should change the TRS ' | Sakshi
Sakshi News home page

‘టీఆర్‌ఎస్ అధ్యక్షుడిని మార్చాలి’

Jun 23 2016 11:45 PM | Updated on Sep 4 2017 3:13 AM

టీఆర్‌ఎస్ పార్టీ నియమావాళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీ మండల అధ్యక్షుడు మొలుగూరి రమేష్ పదవి నుంచి ...

దేవరుప్పుల : టీఆర్‌ఎస్ పార్టీ నియమావాళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీ మండల అధ్యక్షుడు మొలుగూరి రమేష్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జెరిపోతుల సాయిలు, కొత్త జలంధర్‌రెడ్డి మాట్లాడుతూ పద్దెనిమిది గ్రామాలకుగానూ పదహారు గ్రామ శాఖ అధ్యక్షులు తిరస్కరిస్తున్న క్రమంలో ఇంకా ఆయననే అధ్యక్షుడిగా కొనసాగడం పార్టీకి నష్టం వాటిల్లుతుందని, వెంటనే ఆయన పదవిని రద్దు చేసీ సమన్వయ కమిటి వేయాలని కోరారు.


సర్పంచ్‌లు భీముడు, మేడ సునీత సోమనర్సయ్య, నాయకులు తీగల సత్తయ్య, జోగు ఐలయ్య, ఖాసీమ్, పరుశరాములు, చంద్రభాను, వీరాచారీ, కృష్ణమూర్తి, బబ్బూరి యాదగిరి, చిలుపురం సోమయ్య, కాశబోయిన యాకన్న, ఠాగూర్, సోమయ్య ఉన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement