ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు | The police refused to sand smuggling | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులు

Apr 11 2015 10:24 AM | Updated on Aug 28 2018 8:41 PM

ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

వరంగల్ జిల్లా: ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటన శనివారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఆకేరు వాగు వద్ద జరిగింది. హన్మకొండ మండలం మామునూర్ గ్రామానికి చెందిన ఎస్సై ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని 18 ట్రాక్టర్లను సీజ్ చేశారు. అంతేకాకుండా ట్రాక్టర్ల యజమానులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో తదుపరి చర్యల కోసం వర్ధన్నపేట ఎమ్మార్వోకు సమాచారం అందించారు.  
(వర్ధన్నపేట)

Advertisement
 
Advertisement
Advertisement