పీటల మీద పెళ్లి ఆగిపోయింది! | the marriage was stopped on the bhupala palli district | Sakshi
Sakshi News home page

పీటల మీద పెళ్లి ఆగిపోయింది!

Mar 18 2017 5:08 PM | Updated on Aug 21 2018 5:51 PM

పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

గణపురం: పెళ్లికి సిద్ధమైన వరుడి గుట్టు బయటపడడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వేరొక మహిళతో ఉన్న సంబంధాన్ని దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో శనివారం జరిగింది.

రాంప్రసాద్‌ గౌడ్‌ అనే వ‍్యక్తి ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి చెల్పూరులో ఓ యువతితో వివాహానికి సిద్ధపడ్డాడు. విషయం ఎలాగో బయటకు పొక్కడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement