
2019 కల్లా భావ విప్లవం: గద్దర్
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రజల జీవనశైలిలో ఎలాంటి మార్పులు రాలేదు..
ప్రజావ్యతిరేకంగా పాలన సాగుతున్నందున తెలంగాణలో ప్రత్నామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ‘పల్లెపల్లెకు పాట – పార్లమెంట్‌కు బాట’ అనే నినాదంతో ప్రజలను చైతన్యం చేసేందుకు తెలంగాణలోని అన్ని శక్తులు ఏకమై ముందుకు సాగుతామన్నారు. చెరుకు సుధాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ పురుడు పోసుకుందని ఆ పార్టీ తెలంగాణలోని ఇంటింటికీ వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆ పార్టీ ముందుకు సాగేందుకు తమ మద్దతు ఉంటుందని గద్దర్ పేర్కొన్నారు.