జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి జయరాజ్
కలెక్టరేట్ ఎదుట ధర్నా
సంగారెడ్డి క్రైం : జిల్లాను కరువు ప్రాం తంగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ జిల్లాలో 44 మండలాల్లో కరువు ఉందని అధికారులు నివేదిక పంపినప్పటికీ ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు పంటలు నష్టపోయారన్నారు.
అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణాలో 800 మంది, జిల్లాలో 170 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిం చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు కె.రాజయ్య, నాయకులు శ్రీనివాస్, యాదవరెడ్డి, యాదయ్య, మల్లయ్య పాల్గొన్నారు.