వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో తగిడిమర్రి శ్రీహరి(30)ని చంపి పొలంలో పడేశారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తగిడిమర్రి శ్రీహరి(30) స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కొట్టి చంపి, గ్రామ శివారులోని పొలాల్లో పడేసి వెళ్లారు. సోమవారం ఉదయం అటుగా వెళ్లిన వారు చూసి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చని పోలీసలు అనుమానిస్తున్నారు.