ఉపాధి కూలీలకు బ్యాంకుల భయం | The bank 's depositing Employment Guarantee labor Money | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు బ్యాంకుల భయం

Feb 17 2016 5:12 PM | Updated on Sep 5 2018 8:24 PM

బ్యాంకర్లు పాత బకాయిల కింద కూలీ డబ్బులను జమ చేసుకుంటుండడంతో ఉపాధి కూలీకి వె ళ్లాలంటేనే నిరుపేదలు భయపడుతున్నారు.

బ్యాంకర్లు పాత బకాయిల కింద కూలీ డబ్బులను జమ చేసుకుంటుండడంతో ఉపాధి కూలీకి వె ళ్లాలంటేనే నిరుపేదలు భయపడుతున్నారు. ఉపాధి హామీ పధకం కింద కూలీలు చేసిన పనులకు గాను ఈజీఎస్ నుంచి వారానికోరోజు నేరుగా బ్యాంకులో వారిపేరిట ఖాతాల్లో డబ్బులు జమ అవుతోంది. ఈ డబ్బును కూలీలు బ్యాంక్ ఖాతాల్లోనే ఉంచుకుంటున్నారు. అయితే, ఈ డబ్బు నిల్వ చూసిన బ్యాంకు అధికారులు మాత్రం సంబంధిత వ్యక్తుల పాత బకాయిల కింద మినహాయించుకుంటున్నారు. దీంతో కూలీలు లబోదిబోమంటున్నారు.


దీనిపై స్పందించిన ఈజీఎస్ అధికారులు.. ఖాతాల్లో డబ్బును వెంటనే డ్రా చేసుకోండంటూ కూలీలకు సూచిస్తున్నారు. బ్యాంక్ చర్యల కారణంగా కూలీలు ఉపాధి పనులు మానేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్క రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రెండువేల మంది ఇప్పటికే పనులు మానేశారని అన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధి పనుల లక్ష్యం కుంటుపడింది. దీంతో కూలీల్లో ధైర్యం నింపేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆయా బ్యాంక్ మేనేజర్లతో సమావేశమయ్యేందుకు కూడా సిద్ధమవుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement