దండంతో సరి!

Temples Gears Up To Resume Darshan In Telangana - Sakshi

గంట వాయించడమూ నిషేధమే..

8 నుంచి రాష్ట్రంలో తెరుచుకోనున్న ఆలయాలు..

సాక్షి, హైదరాబాద్‌: వేకువజామునే సుప్రభాత సేవలు.. దైవ నామస్మరణలు, ఘంటానాదాలు, హారతులు, భక్తుల ప్రదక్షిణలు, మొక్కులు, తీర్థ ప్రసాదాల వితరణ. దేవాలయాల్లో నిత్యం మనకు వినిపించే, కనిపించే సన్నివేశాలివి. కానీ లాక్‌డౌన్‌తో దాదాపు రెండున్నర నెలలుగా మూతపడి ప్రభుత్వ తాజా సడలింపులతో ఈ నెల 8 నుంచి తెరుచుకోనున్న ఆలయాల్లో ఈ సందడికి బ్రేక్‌ పడనుంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ గుడిలోని మూలవిరాట్టును దర్శించుకొని వెళ్లిపోవడమే కొంతకాలంపాటు నిత్యకృత్యం కానుంది. తీర్థప్రసాదాలే కాదు.. చివరకు ఘంటా నాదం, శఠగోప ఆశీర్వచనాలనూ నిర్వహించ వీల్లేని అనివార్య పరిస్థితి ఎదురుకానుంది.

మార్గదర్శకాలు ఇవీ..
దేవాదాయ శాఖ పరిధిలోని 100 ప్రధాన దేవాలయాలన్నింటికీ ప్రభుత్వం థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాలు సరఫరా చేస్తోంది. భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉండే మిగతా ఆలయాల్లో కమిటీలే వాటిని కొనుగోలు చేసుకోవాలి.
ఆలయాలకు వచ్చే భక్తుల్లో జ్వర లక్షణాలుంటే ప్రవేశం ఉండదు.
65 ఏళ్లు దాటిన వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలకు కూడా ప్రవేశం లేదు. మిగతా భక్తులు పరిమిత సంఖ్యలో భౌతికదూరం పాటిస్తూ ఆలయంలోకి వెళ్లాలి.
పార్కింగ్‌ కేంద్రాల్లోనే చెప్పులు వదిలేయాల్సి ఉంటుంది.
ఆలయ ప్రవేశద్వారాం వద్ద చేతులను శానిటైజ్‌ చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కరించి నిష్క్రమించాలి.
తీర్థ, ప్రసాదాలు, శఠగోపం ఉండదు. నివేదించేందుకు ఇంటి నుంచి నైవేద్యాలు తెస్తే అనుమతించరు.
కొబ్బరికాయ కూడా కొట్టడం నిషేధం.
ఆలయాల్లో అన్నదానాలు కూడా పాత పద్ధతిలో కుదరదు. దాని బదులు సంతర్పణ పదార్థాలను ప్యాకెట్లలో ఉంచి అందించొచ్చు.
దేవాలయాల సమీపంలో ఉండే దుకాణాల్లో అమ్మే ప్రసాదాలకు అనుమతి ఉంటుంది.
గుళ్లలో భక్తి పాటలు పాడే అవకాశం కూడా లేదు. సంగీత విభావరిలు నిర్వహించరాదు. కానీ రికార్డుల ద్వారా భక్తి పాటలు వినిపించవచ్చు.
పెద్ద దేవాలయాల్లో భక్తులు విడిది చేసేందుకు ఉండే వసతి గృహాలను ప్రస్తుతానికి మూసే ఉంచుతారు.
పుష్కరుణులు, కోనేరుల్లో స్నానాలకు అనుమతించరు.
తలనీలాల సమర్పణ కూడా నిషేధం.
ఆలయాలకు చెందిన కల్యాణ మండపాలు కూడా మూసే ఉంటాయి. వాటిని అద్దెకివ్వరు. 

వారంపాటు అమలు..
లాక్‌డౌన్‌ మినహాయింపుల్లో భాగంగా సోమవారం నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించడం తో రాష్ట్రంలోనూ ఆలయాల్లో దర్శనాలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి దండంతో సరిపెట్టుకునేలా నిబంధనలు ఏర్పాటు చేసింది. సీఎం నుంచి అనుమతి నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో చర్చించి దేవాలయా లు తిరిగి తెరిచేందుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత విధానాన్ని వారంపాటు అమలు చేసి చూడనున్నారు. ఎక్కడైనా ఇబ్బందులొస్తే మరిన్ని మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఆలయాలు తెరిచిన తర్వాత కరోనా కేసుల వేగం పెరిగితే ఆలయాలపై మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. చాలా కాలం తర్వాత దేవుళ్ల దర్శనం కలుగుతుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 11:06 IST
సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి...
08-05-2021
May 08, 2021, 10:09 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 08:36 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్‌లోని వివేకానగర్‌ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు....
08-05-2021
May 08, 2021, 07:06 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
08-05-2021
May 08, 2021, 03:45 IST
సాక్షి, అమరావతి: కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య సేవలను ప్రభుత్వం మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు...
08-05-2021
May 08, 2021, 03:36 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో మరిన్ని ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సామాజిక/రాజకీయ/క్రీడా/వినోద/విద్యా/మత/సాంస్కృతికపరమైన...
08-05-2021
May 08, 2021, 03:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు...
08-05-2021
May 08, 2021, 03:26 IST
సాక్షి, అమరావతి:  జిల్లా స్థాయిలో కోవిడ్‌–19 వ్యాప్తిని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించేందుకు జిల్లా ఇన్‌చార్జి మంత్రుల అధ్యక్షతన...
08-05-2021
May 08, 2021, 03:20 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల...
08-05-2021
May 08, 2021, 03:15 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కేంద్ర మాజీ మంత్రి, బాలీవుడ్‌ నటుడు...
08-05-2021
May 08, 2021, 03:09 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సంజీవనిలా నిలుస్తోంది....
08-05-2021
May 08, 2021, 03:08 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఈ వైరస్‌ ప్రధానంగా గురిపెట్టేది ఊపిరితిత్తుల పైనేనని, దీనివల్ల శ్వాస సంబంధ సమస్యలొస్తాయని,...
08-05-2021
May 08, 2021, 03:06 IST
కౌలాలంపూర్‌: మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు...
08-05-2021
May 08, 2021, 02:53 IST
ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే....
08-05-2021
May 08, 2021, 01:22 IST
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో కరోనా నిర్ధారణ...
08-05-2021
May 08, 2021, 01:21 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన...
08-05-2021
May 08, 2021, 00:43 IST
సాక్షి, కాజీపేట అర్బన్‌: కోవిడ్‌–19పై వరంగల్‌ అర్బన్‌ జిల్లా కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో చేపట్టిన పరిశోధనలు ఏడాది...
08-05-2021
May 08, 2021, 00:42 IST
మనకు జన్మతః తల్లితండ్రులు, బంధువులు ఉంటారు. పెరిగే కొద్ది స్నేహితులూ ఉంటారు. కాని మనింట్లో ఒక రేడియో సెట్‌ ఉంటే...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top