కార్మికుల క్యాంపులో కరోనా సెగ! | Sakshi
Sakshi News home page

కార్మికుల క్యాంపులో కరోనా సెగ!

Published Fri, Apr 24 2020 2:03 AM

Telangana People Struggling In UAE Ajman Camp - Sakshi

మోర్తాడ్‌ (బాల్కొండ): గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన తెలుగు కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న తమ ఆరోగ్యం గురించి కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలంగాణ జిల్లాలకు చెందిన వలస కార్మికు లు వాపోతున్నారు. యూఏఈలోని దుబాయ్‌లోని అజ్‌మాన్‌ క్యాంపులో 40 మంది తెలుగు కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా నిజామాబాద్, జగిత్యా ల, కరీంనగర్‌ జిల్లాలకు చెందిన వారే. దుబాయ్‌లో ని బెల్‌ హాసా కంపెనీ వలస కార్మికులను నియమించుకుని ఆస్పత్రిలో రోగులకు సేవలు అందించడానికి తరలిస్తుంది. రోగులకు సేవలు అందించే కార్మికులను అక్కడ మెసెంజర్‌లుగా పిలుస్తారు. రోగులను ఒక వార్డు నుంచి మరో వార్డుకు తీసుకెళ్లడం.. మృతదేహాలను మార్చురీకి తరలించడం ఈ మెసెంజర్ల బాధ్యత. దుబాయ్‌లోని అల్‌ ఖస్సిమి ఆస్పత్రిలో కరోనా బారినపడిన వారి సంఖ్య ఎక్కు వే ఉంది.

అయితే.. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న కార్మికులకు కేవలం మాస్కులు మాత్రమే అందించారు. దీంతో కొందరి ఆరోగ్యం దెబ్బతినడం.. 10 మంది కార్మికులకు కరోనా లక్షణాలు ఉ న్నట్లు తేలడంతో వారికి మెరుగైన వైద్యం అందించకుండా, క్యాంపులోని ఒక గదిలో సెల్ఫ్‌ క్వారంటైన్‌ చేశారు. ఒకే కాంపౌండ్‌లో క్వారంటైన్‌లో ఉన్న వీరి తో పాటు ఇతర కార్మికులను ఉంచడంతో అక్కడి తెలుగు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కం పెనీ యాజమాన్యం తీరును ఆక్షేపిస్తూ కార్మికులు వీడియో తీసి సోషల్‌ మీడియా ద్వారా గోడును వెళ్లబోసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి యూఏఈలోని మన విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడాలని వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement